చీరాల : పర్యావరణం కాపాడుకోవడంలో ప్రతిఒక్కరు బాధ్యత వహించాలని ఐఎంఏ చీరాల అధ్యక్షులు డాక్టర్ పివి ప్రసాద్ పేర్కొన్నారు. చీరాల ప్రభుత్వ మహిళా కళాశాల ఆవరణలో పర్యావరణం కాపాడుకోవడంలో మొక్కల ప్రాధాన్యత ను విద్యార్థినులకు వివరించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల కు ఒక్కొక్కరికి ఒక గుడ్డ సంచి, ఒక మొక్క చొప్పున పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వాడవద్దని చెప్పారు. మొక్కలను పెంచాల్సిన ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణమ్మ, డాక్టర్ రామకృష్ణ హనుమాన్, డాక్టర్ ఐ బాబూరావు, డాక్టర్ రాధిక, డాక్టర్ శంకరరెడ్డి, డాక్టర్ ఎస్ కొండలరావు, డాక్టర్ ఫణి, అధ్యాపకులు సంతోషికుమారి, శ్రీలత, పౌలు, హరిహర ప్రసాద్, అటవీ శాఖ అధికారి చంద్రారెడ్డి పాల్గొన్నారు.