బాపట్ల (Bapatla) : రీ సర్వే పట్టాదారు పాసుపుస్తకాలు ఎనిమిది గ్రామాల్లో నెల రోజుల్లో పూర్తి చేస్తామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సిసిఎల్ఎ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మికి తెలిపారు. రీ సర్వేపై సిసిఎల్ఎ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి రాజధాని అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలతో మంగళవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. రీ సర్వే పట్టాదారు పాసుపుస్తకాల జారీపై సమగ్ర ప్రణాళిక రూపొందించుకున్నామని కలెక్టర్ ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాలో ఐదు నియోజకవర్గాలుండగా 10 గ్రామాలు ఎంపిక చేసుకున్నామని అన్నారు. 5,569 పాస్ పుస్తకాలు ఇవ్వాలని లక్ష్యంకాగా ఈపాటికే 4,236 పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని అన్నారు. 76.6 శాతం ఈకేవైసీ లక్ష్యానికి చేరుకున్నామని తెలిపారు. మిగిలినవి నెల రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. రీ సర్వే పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని సిసిఎల్ఎ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట, భూములు రికార్డుల శాఖ ఎడి కెవి శేషగిరిరావు, అల్తాఫ్ పాల్గొన్నారు.




