రేపల్లె (DN5 News) : ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే పిజిఆర్ఎస్ కార్యక్రమం ఈనెల 23న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్థానిక పతిపాటి సీతారామ యోగిని, పాలాటి రాజ్యలక్ష్మి స్మారక కళ్యాణ మండపం నందు పిజిఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ శుక్రవారం తెలిపారు. కలెక్టరేట్‌కు సోమవారం ఎవ్వరు అర్జీలు తీసుకొని రావద్దని తెలిపారు. ఉదయం 9 నుండి 10వరకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజల నుంచి సమస్యల అర్జీలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఆర్‌డిఒ, తహశీల్దారు కార్యాలయాల్లో తహశీల్దార్లు, ఎంపిడిఓలు ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. పిజిఆర్ఎస్‌కు అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని తెలిపారు. అర్జీదారులు పిజిఆర్ఎస్‌లో అందజేసిన అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. Meekosam.ap.gov.in వెబ్సైట్ నందు అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






