అమృతలూరు, మార్చి 09 (DN5 News) : జిల్లాలో తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రజల వద్దకు పరిపాలనను తీసుకువెళ్లడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. చీరాల మున్సిపల్ కార్యలయంలో శాసన సభ్యులు ఎంఎం కొండయ్యతో కలిసి నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి 296 అర్జీలు స్వీకరించగా వాటిని గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.






