Home ఆధ్యాత్మికం వైభ‌వంగా పునుగు రామ‌లింగేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో పూజ‌లు

వైభ‌వంగా పునుగు రామ‌లింగేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో పూజ‌లు

481
0

చీరాల : శ్రీ శత సహస్ర బిల్వార్చన పేరాల శివాలయం నందు శ్రీ గంగా భ్రమరాంబ సమేత పునుగు రామలింగ మల్లేశ్వర స్వామి వారికి ఎంతో వైభవంతో పూజా కార్యక్రమాలు నిర్వ‌హించారు. కార్తీక మాసం చివ‌రి రోజు కావ‌డంతో ఆల‌యంలో భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. శ్రీ శత సహస్ర బిల్వార్చన పూజా కార్యక్రమంలో భ‌క్తులు పాల్గొన్నారు. ఉదయం రుద్రాభిషేకము, లక్ష బిల్వార్చన చేశారు. సాయంకాలం బ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. ఈ కార్యక్రమం నందు దేవాదాయ అధికారి జివిఎల్‌ కుమార్, శివాలయం అర్చకులు కారంచేటి రాజశేఖర్గా, నగేష్, రాము, వేద‌పండితులు శేష‌గిరి, వెంక‌టేష్‌శ‌ర్మ‌, సాయికృష్ణ‌, ఆల‌య క‌మిటి స‌భ్యులు ప‌ర్య‌వేక్షించారు.

శివాలయంలో కార్తీకమాస దీపాలంకరణకు ఆల‌య‌ అన్నదాన ముఖ్య సభ్యులు తాడివలస దేవరాజు స‌మ‌కూర్చారు.