నంద్యాల : జిల్లాలోని గాజులపల్లె గ్రామ సమీపంలోని వాగులో వజ్రాలు దొరుకుతున్నాయనే ప్రచారంతో దూరప్రాంతాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు వచ్చారు. వాగులోకి చేరుకొని ఎవరికి వాళ్లే బిజీగా వజ్రాల కోసం వెతుకుతున్నారు. ఈ దృశ్యం చూస్తే అక్కడేదో తిరునాళ్ల జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ వాళ్లంతా వజ్రాలు దొరుకుతాయని వెతుకుతున్నారు. ఏంటో… ఆశ, ఆసక్తి. ఊరికే వస్తుందంటే ఎంతైనా ఖర్చు పెడుతున్నారు. ఇలాంటి వాళ్లను చూసేనేమో ‘అద్దెడు గింజల ఆదాయానికి పోతే తూమెడు గింజలు దూడ తినిందంట’ అనే సామెతలు పుట్టి ఉంటాయి. ఎవరికెన్ని వజ్రాలు దొరుకుతాయో తెలియదు కానీ ఆ ప్రాంతంలో ఈ ప్రాచారంతో ఎంతో కొంత వ్యాపారమైతే జరిగి ఉంటుంది. బడ్డీ కొట్ల చిరు వ్యాపారులకైనా కొంత మేలు జరిగి ఉండే ఉంటుందిలే…






