చీరాల : పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ్యులు కొండయ్య అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమంగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో అర్హత ప్రామాణికం తప్ప, రాజకీయాలు, ప్రాంతాలు, కులాలు చూసే ప్రసక్తే లేదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు.
నియోజకవర్గంలోని గవినివారిపాలెం, వేటపాలెం మసీ సెంటర్ నందు, చీరాల పట్టణంలోని 18, 19 వార్థుల నందు, చీరాల మండలం రామకృష్ణాపురం, వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామంలో శివాలయం దగ్గర “ఎన్టీఆర్ సేవ పథకం” కింద పెన్షన్ల పంపిణీలో భాగంగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. ఆయన వెంట ఆప్కో చైర్మన్ సజ్జ హేమలత, టిడిపి పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, కౌన్సిలర్ మించాల సాంబశివరావు, కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.