చీరాల (Chirala) : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అన్నారు. పట్టణంలోని బెస్తపాలెం, సాయి కాలనీ, 5వ వార్డులో పెన్షన్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీ ప్రకారం ప్రతి నెల 1న పెన్షన్లు పంపిణీ చేస్తూ దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీని అమలు చేస్తోందని అన్నారు. గత 17 నెలల్లో రూ.50,763 కోట్లు పెన్షన్ల రూపంలో ప్రజల చేతుల్లోకి చేరాయని పేర్కొన్నారు. ఇంత భారీ స్థాయిలో పెన్షన్లు అమలు చేస్తోన్న ఘనత సిఎం చంద్రబాబు, ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ దేనని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, టిడిపి పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, ఎఎంసి చైర్మన్ కౌతరపు జనార్దన్, కమిషనర్ అబ్దుల్ రషీద్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.






