Home ప్రకాశం ప్రతి ఒక్కరు సామరస్యంగా మెలగాలి : ఎస్ఐ శ్రీకాంత్

ప్రతి ఒక్కరు సామరస్యంగా మెలగాలి : ఎస్ఐ శ్రీకాంత్

377
0

– దేవాలయాలు, చర్చ్ లు, మసీదుల్లో సీసీ కెమెరాలు, వాచ్ మేన్ ను ఏర్పాటు చేయాలి
– బయట నుంచి వచ్చే వారితో అప్రమత్తంగా ఉండాలి: దేవరాజు
– దేవాలయాల పెద్దలతో శాంతి కమిటీలు ఏర్పాటు చేయాలి
చీరాల : ఎస్పీ సిధార్థ కౌషిల్ ఆదేశాల మేరకు పేరాల శివాలయం, చర్చ్, మసీదుల్లోని పెద్దలు, కమీటి సభ్యులతో సమావేశం నిర్వహించారు. మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టూ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ అన్ని మతాల పెద్దలకు సూచించారు.

ఎస్ఐ మాట్లాడుతూ బయటి నుంచి వచ్చే వారు మత పరమైన వివాదాలు చేసే అవకాశం ఉందన్నారు. రాజకీయ కోణంలో కుట్రలు జరిగే అవకాశం ఉందని, అటు వంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుడి, చర్చ్, మసీదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా రాత్రి సమయాల్లో వాచ్మెన్ ను ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని మతాల వారు ఐక్యంగా ఉంటు ఒకరి ఆచారాలను మరొకరు గౌరవించుకోవాలన్నారు.

శ్రీ కామాక్షి కేర్ ఎండీ, చీరాల జిల్లా సాధన జేఏసీ చైర్మన్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ చీరాలలో అన్ని మతాల ప్రజలు ఐక్యంగా ఉంటారన్నారు. ఇక్కడ మత ఘర్షణలకు తావు లేదన్నారు. అన్ని దేవాలయాల పెద్దలతో శాంతి కమిటీలు ఏర్పాటు చేసి మత సామరస్యానికి కృషి చేయాలి అన్నారు. అంతర్వేది రథం దగ్ధం నేపధ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి సీబీఐ విచారణకు ఆదే సించటం మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో పేరాల శివాలయం అర్చకులు రాము, నగేష్, రాజశేఖర్, రాజు, చర్చి పాస్టర్, పేరాల మసీద్ మత పెద్దలు, స్థానికులు, పోలీస్ సిబంది సుబ్భారావు, లెనిన్, సుధాకరరెడ్డి పాల్గొన్నారు.