Home బాపట్ల 4న పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల చీరాల, పర్చూరు నియోజకవర్గాల పర్యటన

4న పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల చీరాల, పర్చూరు నియోజకవర్గాల పర్యటన

10
0

చీరాల (Dn5 News) : ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈనెల 4న బాపట్ల జిల్లాలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆదేశాలతో వేటపాలెం మండలం కొత్తపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడారు. 4న పర్చూరు నియెజకవర్గం ఇంకొల్లులో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రచ్చబండలో పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి వేటపాలెం మండలం కొత్తపేటలో నిర్వహించే రచ్చబండలో పాల్గొంటారని తెలిపారు. ఉపాధి హామీ పథకం కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంకు మహాత్మగాంధీ పేరు తొలగించి, పథకంలో కూలీలకు నష్టం చేసే విధంగా తెచ్చిన మార్పులను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అనంతరం కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతం చేయడంపై చర్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎఎంసి చైర్మన్ మార్పు గ్రేగోరి, ఎపిసిసి సభ్యులు సయ్యద్‌ అలింబాబు, కొత్తపేట మాజీ సర్పంచి చుండూరు వాసు, పులి శంకర్, దేవరపల్లి బాబురావు, మాజీ కౌన్సిలర్‌ మల్లెల బుల్లి బాబు, రహమాన్, మిరియాల శ్రీనివాసరావు, ఎఎంసి మాజీ డైరెక్టర్‌ కనపర్తి బజ్జిబాబు, మేరిగ ఇస్సాకు, మేరిగ రమేష్‌, పులి శంకర్‌ పాల్గొన్నారు.