వేటపాలెం : స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ మహిళలకు వైద్య పరీక్షలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రుల మహిళా విభాగం ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వరప్రసాద్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడారు. మహిళల ఓర్పు, సేవ, మాతృహృదయ స్పందన చాలా గొప్పదని కొనియాడారు. భారతదేశంలో మహిళలను గౌరవంగా చూడటం అనేది ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో గొప్ప విషయం అన్నారు. ఇతిహాసాలలో మహిళలకు ప్రత్యేకత ఉందన్నారు. కార్యక్రమంలో సభ్యురాలు పేరక నగరాజ కుమారి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.