బాపట్ల : మెప్మా కింద 836 గ్రూపులోని 8460 సభ్యులకు ఒక్కొక్కరికి రూ.పదివేల చొప్పున పసుపు కుంకుమ నగదును నేరుగా వారి బ్యాంక్ ఎకౌంట్ లలో వేశారు. 2018ఏప్రిల్ నుండి కొత్తగా పెళ్లి చేసుకున్న వారు చంద్రన్న పెళ్లి కనుకకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుతం ప్రకటించింది. మహిళలు 8, 9వ తరగతులు చుదువుతూ ఆపివేసిన వారిని మరల మెప్మా ఆధ్వర్యంలో 10వ తరగతి, ఇంటర్ వరుకు ఉచితంగా చదివిస్తామన్నారు. 836గ్రూపులకు రూ.8కోట్ల బ్యాంక్ రుణాలు ఇప్పించడం ద్వారా మహిళలకు జీవనోపాది కలుగుతుందని మెప్మా సీఎంఎం జోష్ణ తెలిపారు.