బాపట్ల : పాస్ పోర్ట్ సేవల కార్యాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఎల్‌సి అన్నం సతీష్ ప్రభాకర్ కోరారు. నూతన కార్యాలయాన్ని ఆయన శుక్రవారం ప్రారంబించారు. ఇప్పటి వరకు పాస్ పోర్టు సేవలు కోసం విజయవాడ, హైదరబాద్ వెళ్లే వారని ఇకమీదట అలాంటి అవసరం లేకుండ బాపట్లలో పాస్‌పోర్టు కోసం ధరకాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వం ఎప్పుడూ ప్రజా సంక్షేమం ఆలోచిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు సభ్యులు శ్రీరాం మాట్లాద్రి పాల్గొన్నారు.