Home బాపట్ల నల్లబర్లీ రైతుల సమస్యను సీఎంకు వివరించిన ఎమ్మెల్యే ఏలూరి

నల్లబర్లీ రైతుల సమస్యను సీఎంకు వివరించిన ఎమ్మెల్యే ఏలూరి

23
0

పర్చూరు : నల్లబర్లి పొగాకు రైతుల సమస్యను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం పర్చూరు నియోజకవర్గంలోని పెద్దగంజాం కొత్త గొల్లపాలెంలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నల్లబర్లి పొగాకు కొనుగోలు లేక, సరైన ధర లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎంకు వివరించారు. అలాగే తక్కువ నీటిలభ్యతతో ఈ పంట సాగు అవుతుందని వివరించారు. ఇక్కడ పండిన నల్లబర్లి విదేశాలకు ఎగుమతి అవుతుందని, అత్యధికంగా ఇంగ్లాండ్ కు వెళుతుందని వివరించారు. ఎమ్మెల్యే ఏలూరి వివరించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో ఆయా కంపెనీలతో సమీక్ష సమావేశం నిర్వహించి పంట కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు.