పర్చూరు : వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఇంకొల్లు మండలం పావులూరుకు చెందిన ఇంకొల్లు మాజీ జడ్పిటిసి గుంజి వెంకట్రావు నియమితులు అయ్యారు. ఈ మేరకు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు నియామక ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు గుంజి వెంకట్రావును అభినందించారు. అన్నదాతల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేయాలని అన్నారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ లక్ష్యాలు రైతుల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పంట ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.