Home ప్రకాశం చేనేత రంగానికి పడవల సేవలు మరువలేనివి

చేనేత రంగానికి పడవల సేవలు మరువలేనివి

364
0

చీరాల : ఈపూరుపాలెంలోని బాపూజీ యూనియన్ కమ్యూనిటీ హాలులో ప్రజాబంధు ప్రగడ కోటయ్య ఆర్గనైజేషన్ అధ్యక్షులు దామర్ల శ్రీకృష్ణ ఆధ్వర్యంలో చేనేత నాయకులు పడవల లక్ష్మణస్వామికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సంతాపసభ నిర్వహించారు. సభకు మాచర్ల మోహనరావు అధ్యక్షత వహించారు. సభలో ఎమ్యెల్సీ పోతుల సునీత మాట్లాడారు. ముందుగా పడవల లక్ష్మణస్వామి చిత్ర పటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రజాబంధు ప్రగడ కోటయ్య శిష్యులలో ప్రథమ శిష్యుడిగా పేరు తెచ్చుకున్న పడవల లక్ష్మణ స్వామి చేనేత పరిరక్షణకు, చేనేతల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో యెనలేని పోరాటాలు చేశారని గుర్తు చేశారు. పద్మశాలీయ ఇంటర్ నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ (పి ఐ డబ్ల్యూ ఎ )కి చీరాల బ్రాంచి అధ్యక్షులుగా ఉండి చేనేత జాతి అభివృద్ధికి సేవలందించారని పేర్కొన్నారు. చేనేత పరిశ్రమకు వారు చేసిన సేవలు మరువలేనివని పలువురు చేనేత నాయకులు, వివిధ రంగాల రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు కొనియాడారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకర విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో పోతుల సురేష్, వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి, ఎఎంసి మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, సిపిఐ కార్యదర్శి మేడా వెంకట్రావు, మాజీ జెడ్పిటిసి గుద్దంటి చంద్రమౌళి, కొత్తపేట మాజీ సర్పంచులు చుండూరు వాసు, ఊటుకూరి వెంకటేశ్వర్లు, మాజీ మండల ఉపాధ్యక్షులు నాదెండ్ల కోటేశ్వరావు, మాజీ ఎంపిటిసి గోలి ఆనందరావు, చేనేత నాయకులు బండారు జ్వాలా నరసింహం, డాక్టర్ అందే వరప్రసాద్, అండగుండ నారాయణ, బీరక సురేంద్ర, బీరక పరమేశం, కొల్లిపర వెంకటేష్, చేనేత మిత్రులు పాల్గొన్నారు.