చీరాల (Chirla) : సమాజంలో సైబర్ నేరాల (Cyber Crime) విపరీతంగా పెరిగిపోతున్నాయని, వాటి బారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తలు పాటిస్తూ వ్యక్తి గత సమాచారం, ఓటీపీ వంటివి అపరిచితులకు చెప్పకుండా జాగ్రత్తలు పాటిస్తే మోసపోకుండా ఉండవచ్చని శ్రీ గౌతమి కళాశాల కరస్పాండెంట్ ఎం వెంకటేశ్వర్లు (ఎంవి) అన్నారు. డిజిటల్ భద్రత ప్రాధాన్యాన్ని విద్యార్థులకు చేరవేయాలనే ఉద్దేశంతో శ్రీ గౌతమి డిగ్రీ కాలేజీలో సైబర్ సెక్యూరిటీ అవగాహన తరగతులు మంగళవారం నిర్వహించారు.
లావణ్య ఐటీ అకాడమీకి చెందిన ఎథికల్ హ్యాకర్ మల్లికార్జున్ రాహుల్ విద్యార్ధులకు వివరించారు. పెరుగుతున్న సైబర్ మోసాల పద్ధతులు, వాటి నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఓటీపీ, యుపిఐ మోసాలు, ఫిషింగ్ లింకులు, నకిలీ అప్లికేషన్లు, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా హ్యాకింగ్, డేటా ప్రైవసీ, పాస్‌వర్డ్ సెక్యూరిటీ, సురక్షితమైన ఆన్‌లైన్ లావాదేవీలపై ఉదాహరణలతో వివరించారు. విద్యార్థులు నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ వరప్రసాద్, కళాశాల డైరెక్టర్ వడ్లమూడి శ్రీనివాసరావు మాట్లాడుతు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇలాంటి అవగాహన ఎంతో ముఖ్యమని అన్నారు.






