Home ప్రకాశం ఔట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకం కోసం ఆన్లైన్ ఎగ్జామ్స్

ఔట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకం కోసం ఆన్లైన్ ఎగ్జామ్స్

239
0

చీరాల : బాపట్ల జిల్లా విద్యాశాఖలో ఔట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకం కోసం శుక్రవారం ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించారు. చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఈ పరీక్షను బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి పివిజే రామారావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాశాఖను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా నూతన నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ఆన్లైన్ పరీక్షకు అనువైన అన్ని వసతులు సీఇసీ కళాశాలలో పుష్కలంగా ఉన్నాయని అభినందించారు. కార్యక్రమంలో వేటపాలెం ఎంఈఓ పి సుబ్రహ్మణ్యస్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ఎడిసి యశ్వంత్ పరీక్ష నిర్వహించారు.