Home బాపట్ల కెజిబివిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ ధరఖాస్తుల స్వీకరణ

కెజిబివిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ ధరఖాస్తుల స్వీకరణ

14
0

చీరాల (DN5 News) : కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం (మైనారిటీ) నందు అడ్మిషన్స్ ప్రారంభమైనట్లు ప్రత్యేక అధికారిణి టివి సుజాత తెలిపారు. 6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్ ప్రథమ సంవత్సరం (ఎంపిసి) గ్రూపులో 40 సీట్లు ఉన్నట్లు తెలిపారు. మిగిలిన తరగతులలో ఖాళీ సీట్లు మాత్రమే భర్తీ చేయనున్నట్లు తెలిపారు. కావున మైనారిటీ విద్యార్థినులు, తల్లి తండ్రి లేని వారు, బడిబయట పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. మిగిలిన విద్యార్థినులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. www.apkgbvs.in సైట్‌ ద్వారా ఆన్లైన్‌లో చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 79952 25088, 97019 72773 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. ధరఖాస్తులు ఏప్రిల్ 1లోపు చేసుకోవాలని తెలిపారు.