– 25 స్థానం నుంచి 94 స్థానానికి దిగజారిన ఒంగోలు కార్పొరేషన్.
– సెంచరీ మిస్ అయిన ఒంగోలు
– అధికారుల నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు
– 15వ ఆర్ధిక సంఘం నిధులు హుళక్కేనా
– రాష్ట్రంలో 128 మున్సిపాలిటీ ల్లో 94వ స్థానంలో ఒంగోలు
ఒంగోలు : రాష్ట్రంలో నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లలో ఎంత శాతం చేశారనే వివరాలతోపాటు వాటి స్థానాలు ప్రకటించారు. వీటిలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మరో చరిత్ర సృష్టించింది. పన్నుల వసూళ్లలో గతంలో 25 స్థానంలో ఉన్న ఒంగోలు నగర పాలక సంస్థ ప్రస్తుతం 98వ స్థానానికి దిగజారి చరిత్ర సృష్టించింది.
రంగులెయ్యటం, మనకు సంబంధం లేని సింహాలు, గుర్రాలు, బొమ్మలు పెట్టడంలో వున్న శ్రద్ధ అధికారులకు రెవెన్యూ వసూళ్లలో లేదు. నగరంలో శానిటేషన్ అంతంత మాత్రమే.
ఒంగోలులో మొత్తం 66,069 ఇళ్ల (అసిస్మెంట్ల) సంఖ్య ఉండగా వీటికి రూ.73.39 కోట్ల డిమాండ్ నోటీసు ఇవ్వగా ఇప్పటికి రూ. 37.66 కోట్లు మాత్రమే వాసులు చేసి కలెక్షన్ 51.31శాంతంతో 94వ స్థానంలో నిలిచారు. ఇంకా రు.35.74 కోట్లు వసూలు చెయ్యాల్సి ఉన్నట్లు మునిసిపల్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇంటి పన్నుల తోపాటు మార్కెట్, షాపు రూముల, ట్రేడ్ లైసెన్సు, ప్రకటనల పన్ను లు వసులు చేయాల్సీ ఉంది.
ఇంతకు ముందు అసిస్టెంట్ కమిషనర్ కు రెవెన్యూ బాధ్యత ఇచ్చేవాళ్ళు. నెల క్రితం చేరిన ఏసీకి రెవెన్యూ ఇవ్వలేదు. దీనిలో మతలబేమిటో, ఆ లోగుట్టు ఏమిటో అధికారులు, పాలకులకే తెలియాలి. షాపు రూముల వసూళ్లు, మార్కెట్ వసూళ్లు చెయ్యటం లేదన్నది అందరికీ తెలిసిన సత్యం. ఇకనైనా అధికారులు రెవెన్యూ వసూళ్లపై శ్రద్ధ పెట్టి నగర అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిద్దాం.