Home ప్రకాశం సమాజ సేవకు పునరంకితం కావాలి : శర్మకళాశాల పూర్వ విద్యార్ధులు

సమాజ సేవకు పునరంకితం కావాలి : శర్మకళాశాల పూర్వ విద్యార్ధులు

448
0

ఒంగోలు : 1981 -1990 వరకు ఒంగోలు సిఎస్‌ఆర్‌ శర్మ కళాశాలలో వివిధ డిగ్రీ కోర్సులు చదివిన పూర్వవిద్యార్ధుల సమ్మేళనం శనివారం ఎన్‌జిఒ హోంలో నిర్వహించారు. పూర్వ విద్యార్ధి సంఘం నాయకులు, సెంట్రల్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ వి దిలీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మేళనానికి 100మంది హాజయ్యారు. సమాజం నుండి వివిధ అంశాలను ఆకలింపు చేసుకుని వివిధ రంగాలలో స్థిరపడిన తామంతా తిరిగి సమాజంలోని వివిధ రుగ్మతలను రూపుమాపేందుకు, విద్య, వైద్యం తదితర అవసరాలను తీర్చేందుకు తమవంతు సహకారం అందించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తొలుత శర్మ కళాశాలకు చేరుకున్న వారు తమ తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు. కళాశాలలోని స్వామి వివేకనంద విగ్రహానికి, సీతారాంపురం పాత ఎస్‌ఎం హాస్టల్‌ వద్ద ఏర్పాటు చేసిన విశ్రాంత ఆచార్యులు ఎన్‌ఎస్‌ ఈశ్వరప్రసాద్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్‌ఆర్‌ఎఫ్‌ తరపున పోటీ చేసిన జెఎస్‌ రాజశేఖర్‌, కత్తి కళ్యాణ్‌, అద్దంకి హనుమంతరావు, వివిధ హోదాలలో పనిచేస్తున్న చంద్రశేఖర్‌, రామలింగారెడ్డి, ఈకా మురళి, అశ్వనీకుమార్‌, దారా హరిబాబు పాల్గొన్నారు. కార్యక్రమానికి డాక్టర్‌ శ్రీనివాసులు, ఆళ్ల శ్రీనివాసరెడ్డి, వి భక్తవత్సలం, కనకయ్య, సాయి ఏర్పాట్లు చూశారు.