అద్దంకి (Addanki) : సంతమాగులూరు (Santhamaguluru)మండలంలోని పుట్టావారిపాలెం (Puttavaripalem) అడ్డ రోడ్డు జంక్షన్‌లో బుధవారం అద్దంకి, నార్కెట్‌పల్లి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నై నుండి హైదరాబాదు వెలుతున్న అశోక్ లైలాండ్ ఐజాక్స్ వాహనం ఎదురుగా వెలుతున్న ఎక్సెల్ టివిఎస్50 వాహనంపై వెలుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి వాహనం ముందు టైర్ కింద పడి తల భాగం నుజ్జు నుజ్జై అక్కడికక్కడే మృతి చెందాడు.
పల్నాడు జిల్లా (Palnadu) రొంపిచర్ల (Rompicharla) మండలం అచ్చయ్య పాలెంకు చెందిన జాస్టి నాగయ్య అలియాస్ నాగేశ్వరరావు (53) గ్రామంలో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడు. బుధవారం తన ఎక్సెల్ టీవీఎస్ వాహనాన్ని రిపేర్ చేయించుకునేందుకు అడ్డరోడ్డు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో జంక్షన్‌లో తన వాహనాన్ని తిప్పుకునే క్రమంలో వెనుకాలే అతివేగంగా వచ్చిన అశోక్ లైలాండ్ లారీ ఢీకొంది. దీంతో నాగయ్య వాహనంతో పాటు లైలాండ్ ముందు టైర్ కింద పడిపోయాడు.
ముందు టైరు నాగయ్య తల మీదుగా వెళ్లడంతో నాగయ్య నుజ్జు నుజ్జయింది. తన టీవీఎస్ వాహనం తుక్కు తుక్కయ్యింది. నాగయ్యకు భార్య, ఒక అమ్మాయి ఉంది. విషయం తెలిసిన వెంటనే అచ్చయ్యపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలాన్ని సీఐ వెంకటరావు, ఎస్ఐ పట్టాభిరామయ్య పరిశీలించారు. టైర్ కింద ఉన్న నాగయ్య మృతదేహాన్ని ప్రోక్లైన్ సహాయంతో వాహనాన్ని పైకి లేపి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.






