అమరావతి : ఆరు నెలలు సహవాసం చేస్తే వారి లక్షణాలు వీరికి అబ్బుతాయని పెద్దలు సామెత చెబుతుంటే ఏమో అనుకున్నాను. కానీ చంద్రబాబు మాటలు వింటుంటే నిజమేనేమో అనిపిస్తుంది. అదేంటి అనుకుంటున్నారా…? అదే నండీ ఆయన సుపుత్రుడు నారా లోకేష్ ఉన్నాడు కదా? ఆయనగారి తెలుగు, తెలివితేటలు చూసిన తెలుగు ప్రజలు ఎంత నవ్వుకుంటున్నారో చూస్తున్నాం కదా? ఆమద్య మహానాడు వేదికపై మాట్లాడుతూ బందుప్రీతి, కులతత్వం ఉన్న పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందా? అంటే అది తెలుగుదేశం పార్టీనేనని చెప్పిన లోకేష్ నాలుక్కరుచుకున్నాడు. కార్యకర్తలు ఆయన తప్పులను సరిచేయాల్సి వచ్చింది. మొన్నీమద్యనే ప్రత్యేక హోదా సైకిల్ ర్యాలీలో టివి ఛానెల్‌కు ఇంటర్వూ ఇస్తూ 2014లో ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర విభజన చేశాడని మాట్లాడి తెలివిని ప్రదర్శించాడు.
పుత్రునికి తెలుగు, రాజకీయ తెలివిని నేర్పించిడం కోసం పండితులను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా తిరుపతిలో నిర్వహించిన దర్మదీక్ష సభలో నోరుజారి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. బ్రిటీషు వారిపై పోరాడిన చరిత్ర తెలుగు ప్రజలకుందనబోయిన చంద్రబాబు బ్రిటీషు వారితో పోరాడిన చరిత్ర తెలుగుదేశంపార్టీకుందని ఏకంగా చరిత్రనే తిరగరాశారు. అదే నండీ ఆరు నెలలు సహవాసం చేస్తే వారి లక్షణాలు వీరికి అబ్బుతాయంటే ఇదేనేమో. సుపుత్రునికి తెలుగు, తెలివి, చరిత్ర నేర్పించబోయిన చంద్రబాబునాయుడు సైతం కొడుకు బాష నేర్చుకున్నాడా? లేక మారుతున్న రాజకీయ పరిణామాలు చేస్తూ నోరుజారి మాట్లాడుతున్నాడా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.