చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం కష్టం. ఒక కథానాయకుడి కోసి సిద్ధం చేసిన సబ్జెక్ట్.. మరొక కథానాయకుని చెంతకు చేరుతూ ఉంటుంది. తాజాగా ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసిన కథ మహేశ్ బాబుని వరించిందట.
కన్నడలో తన రెండో సినిమా ‘కె.జి.ఎఫ్’తో సంచలన విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ‘కె.జి.ఎఫ్’ రెండో భాగాన్ని తీర్చిదిద్దుతున్న ఈ డైరెక్టర్.. తన తర్వాతి సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై చేయాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. అయితే ఇప్పుడు తారక్ ప్లేసులో ప్రిన్స్ వచ్చి చేరాడన్నది టాలీవుడ్ కమ్ శాండల్‌వుడ్ టాక్.
ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ వచ్చే యేడాది జూలై 30న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. కానీ అనుకున్న సమయానికి ‘ట్రిపుల్ ఆర్’ రావడం కష్టమేననే సంకేతాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ‘కె.జి.ఎఫ్-2’ని శరవేగంగా పూర్తి చేస్తున్న ప్రశాంత్ నీల్.. ఈ ఏడాది చివరకు కొత్త సినిమాకి ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టాలని భావిస్తున్నాడట. ఎలాగో ఎన్టీఆర్ సినిమా ఆలస్యం అవుతుంది కాబట్టి.. ఆ ప్లేసులో మహేశ్‌తో ముందుకెళ్లాలని నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్- డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భావిస్తున్నారటజ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ని విడుదల చేసే మహేశ్.. ఇప్పటివరకూ తన అప్‌కమింగ్ మూవీపై కమిట్ కాలేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే మహేశ్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌కి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి మరి.