చీరాల : టిడిపి వ్యవస్థాపకులు, అన్న నందమూరి తారకరామారావు 97 వ జయంతి సందర్భంగా చీరాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హస్తకళల కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గురుకుల గంగరాజు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆత్మగౌరవం పేదల సంక్షేమమే లక్ష్యంగా ఆవిష్కరించిన తెలుగుదేశం ఎన్టీఆర్ ఆశయసాధన కోసం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి, టిడిపి పూర్వ వైభవానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమాలు టిడిపి పట్టణ అధ్యక్షులు డేటా నాగేశ్వరరావు, మాజీ జెడ్పిటిసి గుద్దంటే చంద్రమౌళి, మాజీ కౌన్సిలర్ తుపాకుల రఘునాథబాబు, సుబ్బారావు, బొమ్మ గంగయ్య, వెంకట్రావు పాల్గొన్నారు.