చీరాల : ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాభివృద్ది లక్ష్యంగా పనిచేయాలని ఎంపిపి గవిని శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండలం కొత్తపాలెంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ఆయన పరిశీలించారు. గ్రామాల్లో పనులు ఎంపిక చేసుకుని సక్రమంగా చేయించాలని చెప్పారు. ఏడాదికి 300రోజులు పనులు కల్పించేవిధంగా పనులను గ్రామాభివృద్దిని దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసుకోవాలన్నారు. ఆయన వెంట ఎరిచర్ల స్వామిదాసు, మండల కోఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్, ఫీల్డు అసిస్టెంట్ మన్విత పాల్గొన్నారు.