Home ప్రకాశం నవంబర్ 21న డీఈఓ కార్యాలయం ముట్టడి

నవంబర్ 21న డీఈఓ కార్యాలయం ముట్టడి

268
0

చీరాల : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ బదిలీల అసంబద్ధ ఉత్తర్వులను సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న డీఈఓ కార్యాలయాల ముట్టడి చేయనున్నట్లు ఫ్యాప్టో నాయకులు తెలిపారు. కెజియం బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఫ్యాప్టో కరపత్రాన్ని ఆవిష్కరించారు. బదిలీలు మ్యాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాలని కోరారు. సర్వీస్ పాయింట్ లో సీలింగ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. స్టేషన్ సర్వీస్ పాయింట్లు పూర్తిగా ఇవ్వాలన్నారు. 2019నుండి పదోన్నతి, లేదా డీఎస్సీ ద్వారా భర్తీ చేసిన స్థానాలను ఖాళీలుగా చూపించాలని కోరారు. ఖాళీలను బ్లాక్ చేయకుండా అన్నిటిని చూపించాలన్నారు. రేషనలైజేషన్ కు నవంబర్ 3ను ప్రామాణికంగా తీసుకోవాలని పేర్కొన్నారు. సర్వీస్ పాయింట్ సంవత్సరానికి ఒకటి చొప్పున ఇవ్వాలన్నారు. ఉద్యోగ విరమణ 3 సంవత్సరాలలోపు వారిని బదిలీల నుండి మినహాయించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల పరిష్కరం కోరుతూ 21న ఒంగోలు డీఈవో కార్యాలయ ముట్టడిలో ఉపాధ్యాయులందరు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు వి ప్రభాకరరావు, జి సూరిబాబు, షేక్ జాని బాషా, కె వీరాంజనేయులు, పీఎస్వి ప్రసాద్, జి రమేష్, ఎన్ రమణారావు, ఆదిశేషు, కుర్రా రామారావు, ఎస్వీ సుబ్బారెడ్డి, ఎన్ రాజేష్, బుర్ల వెంకటేశ్వర్లు, పి చంద్రారెడ్డి, మల్లెల రవి, నాగమల్లేశ్వరరావు, నాయబ్ రసూల్ పాల్గొన్నారు.