•రైతు ప్రయోజనాలే లక్ష్యంగా ఉత్పత్తుల ఆవిష్కరణ
•అన్నదాతలకు వెన్నుదన్నుగా నోవా గ్రూప్స్
•రైతుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక ఉత్పత్తులు
•నోవా ధృవ, డిఫెండర్ ప్రోడక్ట్ ల ఆవిష్కరణ
•ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఏలూరి
పర్చూరు (Chirala) : అన్నదాతల విశ్వాసమే పెట్టుబడిగా, రైతన్నల ఆశలు ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా నూతన సాంకేతిక పద్ధతులతో ఉత్పత్తులను అందిస్తూ నోవా గ్రూప్స్ వ్యవసాయ రంగంలో అగ్రభాగాన నిలుస్తోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (MLA YeluriSambaa shivarav) అన్నారు. చీరాలలో నోవా అగ్రి గ్రూప్ నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ వేడుకకు ఆయన హాజరయ్యారు. నోవా అగ్రి గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఏటుకూరి కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తూ అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న నోవా గ్రూప్స్ సేవలు అభినందనీయమని ప్రశంసించారు. గత 15ఏళ్లుగా నోవా గ్రూప్స్ నిరంతరం రైతుల అవసరాలకు అనుగుణంగా మారుతున్న సాంకేతిక పద్ధతులతో ఉత్పత్తులు రూపొందిస్తూ రైతన్నల అభ్యున్నతికి పాటుపడుతుందన్నారు.
కోట్లాదిమంది రైతుల అభిమానాన్ని సొంతం చేసుకుని నోవా నిరంతరం అన్నదాతల పక్షాన నిలుస్తుందని అన్నారు. రైతు నిలబడితేనే దేశం మనుగడ, ప్రజలకు కడుపునిండా రెండు పూటలా తిండి, అధిక వ్యవస్థ బలోపేతం, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తుల కంపెనీలు ప్రగతి దిశగా అడుగులు వేస్తాయని అన్నారు. కంపెనీలు తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆర్థిక బలోపేతం కోసం రైతులకు నష్టం చేకూర్చే ఉత్పత్తులు రూపొందించకుండా రైతులకు మేలు జరిగే ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. తక్కువ పెట్టుబడితో రైతులు ఎక్కువ లాభాలు అర్జించేలా అన్నదాతకు చేయూత ఇవ్వాలన్నారు. రైతులు ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తేనే వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.
నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ
నోవా గ్రూప్స్ ఆధ్వర్యంలో రైతు ప్రయోజనాలే లక్ష్యంగా రూపొందించిన నోవా ధృవ, డిఫెండర్ అనే నూతన ఉత్పత్తులను ఘనంగా ఆవిష్కరించారు. ఆధునిక వ్యవసాయ అవసరాలకు తగ్గట్టుగా పరిశోధనాత్మకంగా రూపొందించిన ఈ ఉత్పత్తులు రైతులకు మరింత లాభదాయకంగా మారతాయనే విశ్వాసం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను అర్థం చేసుకుని, వారి పంట దిగుబడులు పెరిగేలా, నూతన సాంకేతికతతో ఉత్పత్తులను రూపొందించడం నోవా గ్రూప్స్ ప్రత్యేకత అని తెలిపారు. భవిష్యత్తులో కూడా రైతు సంక్షేమమే లక్ష్యంగా నోవా గ్రూప్స్ మరిన్ని వినూత్న ఉత్పత్తులను అందించాలన్నారు. ప్రధానంగా నోవా దృవ, డిఫెండర్ ప్రోడక్ట్ లు మొక్కజొన్న పంటకు రక్షణ కవచంలా నిలుస్తుందని పేర్కొన్నారు. మొక్కజొన్నలో చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడులు సాధించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో నోవా గ్రూప్స్ ప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు, డీలర్లు,పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






