ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘పుష్ప’. 2021లో ‘పుష్ప: ది రైజ్’ పేరుతో మొదటి భాగం బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తే.. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం ఏకంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసింది. భారీ వసూళ్లతో ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ను రూల్ చేసింది. ఓటీటీలోనూ ఈ సినిమాకి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ మూవీ స్మాల్ స్క్రీన్‌ను రూల్ చేయడానికి రెడీ అయ్యింది.
‘పుష్ప 2 : ది రూల్’ సినిమా తెలుగు వెర్షన్‌ను ‘స్టార్ మా’ ఛానల్‌లో అతి త్వరలోనే ప్రసారం చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తున్నారు. పుష్పాగాడి రూల్.. ఫియర్ లెస్ పుష్ప.. పుష్ప తాలూకా.. రూల్ బిగిన్స్.. కమింగ్ సూన్ అంటూ సోషల్ మీడియాలో హైప్ ఎక్కిస్తున్నారు. ‘వర్షం పడుతుంది కదా.. పీలింగ్స్ వస్తున్నాయి సామీ’ అంటూ శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ కూడా పెట్టారు. కానీ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారనేది మాత్రం చెప్పలేదు. అయితే టీవీలో వచ్చే యాడ్‌లో మాత్రం ఈ మూవీ ప్రీమియర్ డేట్‌ను అనౌన్స్ చేసినట్లుగా తెలుస్తోంది.
‘పుష్ప 2’ చిత్రాన్ని ‘స్టార్ మా’లో ఏప్రిల్ 13న ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం చేయనున్నారు. థియేటర్లలో సంచలన సృష్టించిన ఈ మూవీకి బుల్లితెరపై కూడా అదే స్థాయిలో వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల కొత్త సినిమాలన్నీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తుండటంతో.. టీవీలో టెలికాస్ట్ అయ్యే సినిమాలకు మంచి టీఆర్పీ రావడం లేదు. రీసెంట్‌గా ఒకేసారి ఓటీటీ, టీవీలో ప్రసారమైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీకి అదిరిపోయే రేటింగ్ వచ్చింది. మరి ‘పుష్ప 2 : ది రూల్’ మూవీ దాన్ని బీట్ చేస్తుందేమో చూడాలి.
World Television Premiere #Pushpa2ThRule
Coming Very Soon On #StarMaa #Pushpa2OnStarMaaComing Soon On Jio Star Network In South Languages #AlluArjun #RashmikaMandanna #FahadhFaasil #Pushpa2 @AlluArjun_Army @TrendsSSAA @AlluArjunTFC pic.twitter.com/kCj2Tgbg29
— Telugu Television News (@TeluguTvExpress) February 21, 2025
‘పుష్ప 1’ మూవీలో శేషాచలం అడవుల్లో కూలీగా జీవితాన్ని మొదలు పెట్టిన పుష్పరాజ్.. ఎర్ర చందనం స్మగ్లింగ్ సిండికేట్‌ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది చూపించారు. ‘పుష్ప 2’లో చీకటి సామ్రాజ్యాన్ని ఎలా ఏలాడు? సీఎంను మార్చేంత శక్తిగా ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడు? తన ఇంటి పేరును ఎలా తెచ్చుకున్నాడు? అనేది ఆసక్తికరంగా చూపించారు. ఇందులో అల్లు అర్జున్ భార్యగా రష్మిక మందన్న నటించింది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్, సునీల్, బ్రహ్మాజీ, జగదీశ్, ఆడుకాలం నరేన్, అజయ్, తారక్ పొన్నప్ప కీలక పాత్రలు పోషించారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.1871 కోట్లు వసూళ్లు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా ‘పుష్ప 3: ది ర్యాంపేజ్’ సినిమా ఉంటుందని కన్ఫార్మ్ చేశారు.