•ప్రతి బూత్ యూనిట్, క్లస్టర్ ఇన్‌చార్జులదే బాధ్యత
•ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం
•రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమ మన లక్ష్యం
•తెలుగుదేశం పార్టీ నే రాష్ట్ర పునర్ని నిర్మాణం
•దేశం గర్వించేలా అమరావతి రాజధాని నిర్మాణం
•ఆంధ్రప్రదేశ్ మార్గదర్శి సీఎం చంద్రబాబు
•సీఎం చంద్రబాబు తోనే ఏపీ అద్భుత ప్రగతి
•తెలుగుదేశానికి పార్టీ కార్యకర్తలు బలం బలగం
•కార్యకర్తల సంక్షేమానికి కృషి చేసే ఏకైక పార్టీ టిడిపి
•కార్యకర్తల అభ్యున్నతికి యువనేత లోకేష్ కృషి
•తెలుగుదేశం పార్టీ శిక్షణ తరగతుల్లో ఎమ్మెల్యే ఏలూరి
అమరావతి (DN5 News): ఎన్నిక ఏదైనా తెలుగుదేశం జెండా ఎగరాలంటే బూత్ స్థాయి వ్యవస్థ పటిష్టంగా ఉండాల్సిందేనని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు. ప్రతి బూత్ యూనిట్, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు బాధ్యతగా పనిచేస్తే పార్టీ విజయం అనివార్యమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో చురుకుగా, నిబద్ధతతో పనిచేస్తే ఎలాంటి ఎన్నికలైనా పార్టీ విజయం సాధించడం తథ్యమని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన క్లస్టర్ ఇన్‌చార్జ్‌ల శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నిక ఏదైనా తెలుగుదేశం జెండా ఎగరాలంటే బూత్ స్థాయి నుంచే కృషి ప్రారంభం కావాలి’ అని అన్నారు.
బూత్ స్థాయి వ్యవస్థతోనే శాశ్వత విజయం
‘బూత్ మేనేజ్‌మెంట్‌నే పార్టీకి అసలైన బలం. ప్రతి బూత్‌లో ఓటర్ల పూర్తి వివరాలు, స్థానిక సమస్యలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారం కార్యకర్తలకు స్పష్టంగా ఉండాలి. ఎన్నికల రోజే కాదు. ఎన్నికల ముందు, తర్వాత కూడా బూత్ వ్యవస్థ బలంగా కొనసాగాలి. అదే పార్టీకి శాశ్వత విజయానికి పునాది’ అని ఏలూరి పేర్కొన్నారు.
ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం
తెలుగుదేశం ప్రజల కోసం పుట్టిన పార్టీ అని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ‘తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యం. దేశం గర్వించేలా అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోంది’ అని తెలిపారు.
సీఎం చంద్రబాబుతోనే ఏపీ అద్భుత ప్రగతి
‘ఆంధ్రప్రదేశ్ మార్గదర్శి సిఎం చంద్రబాబు నాయుడు. ఆయన అనుభవం, దూరదృష్టి, అంకితభావంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. రానున్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో సీఎం యజ్ఞంలా పనిచేస్తున్నారు’ అని కొనియాడారు. ప్రతి కార్యకర్త రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
కార్యకర్తలే పార్టీకి బలం బలగం
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని అన్నారు. ‘కార్యకర్తల సంక్షేమానికి కృషి చేసే ఏకైక పార్టీ టిడిపి. కార్యకర్తల అభ్యున్నతికి యువనేత నారా లోకేష్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు’ అని తెలిపారు.
పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు గౌరవం లభించేలా వ్యవస్థ ఉండాలని అన్నారు.
ఎన్నికల వ్యూహాలపై స్పష్టత
ఈ శిక్షణ శిబిరంలో బూత్ కమిటీ నిర్మాణం, ఇన్‌చార్జ్‌ల బాధ్యతలు, ఓటర్లతో నిరంతర సంబంధం, సోషల్ మీడియా వినియోగం, ప్రతిపక్ష ప్రచారాన్ని ఎదుర్కోవడం వంటి అంశాలపై విపులంగా వివరించారు. ‘ప్రజల నమ్మకం గెలవడమే అసలైన ఎన్నికల వ్యూహం’ అని ఆయన పేర్కొన్నారు.
సంస్థాగత బలోపేతమే లక్ష్యం
గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీని పటిష్టంగా నిలబెట్టాలంటే క్రమశిక్షణ, సమన్వయం తప్పనిసరిగా అవసరమని తెలిపారు. ‘కార్యకర్తే పార్టీకి ప్రాణం. ప్రతి కార్యకర్త కష్టానికి గుర్తింపు లభించేలా వ్యవస్థ ఉండాలి’ అని అన్నారు.






