Home జాతీయం 30 ఏళ్లుగా సినిమా చూసేందుకు మూడుగంట‌లు స‌మ‌యం దొర‌కలేదు : ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌

30 ఏళ్లుగా సినిమా చూసేందుకు మూడుగంట‌లు స‌మ‌యం దొర‌కలేదు : ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌

386
0

ఢిల్లీ : గ‌డిచిన‌ 30 ఏళ్లలో సినిమా చూసేందుకు మూడు గంట‌ల స‌మ‌యం దొర‌క‌లేదు. అందుకే ఈ 30ఏళ్ల కాలంలో ఒక్క‌సినిమా కూడా చూడ‌లేదు. అంటూ భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్ పాఠ‌శాల విద్యార్ధులు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు. చత్తీస్‌గఢ్‌లోని దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో జ‌రిగిన‌ ఓ కార్యక్రమానికి హాజ‌రైన రావ‌త్‌ విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. విద్యార్ధుల‌ సందేహాలు తీర్చారు. అదే స‌మ‌యంలో ఎనిమిదో తరగతి చదువుతున్న శిరియోమ్‌ కశ్యప్‌ అనే విద్యార్థి ‘హిందీ చిత్రాలపై మీ అభిప్రాయం ఏంటి?’ అని ప్రశ్నించాడు.

ఆ విద్యార్ధి ప్ర‌శ్న‌కు బిపిన్ రావ‌త్‌ స్పందించారు. గత 30 ఏళ్లుగా తాను ఎలాంటి సినిమాలు చూడలేదని అన్నారు. సినిమా కోసం మూడు గంటల సమయం వెచ్చించే తీరిక దొరకలేదన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ చదువులో ఓడిపోయినా, జీవితంలో ఓడిపోయినా ఆశ వదులుకోకూడదని చెప్పారు. సాధించేవరకూ కష్టపడుతూనే ఉండాలని అన్నారు. ఓడిపోయినప్పుడే ఎక్కువగా శ్రమించాలని పేర్కొన్నారు. విద్యార్థులు చదువులో రాణించలేని తోటి విద్యార్ధుల‌ను చులకనగా చూడకూడదని సూచించారు. భవిష్యత్తులో దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు కూడా ఆర్మీలో చేరుతారనే ఆశాభావం వ్య‌క్తం చేశారు.