నాగబాబు కూతురు నిహారిక కొణిదెల ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ అయింది. అయితే, అప్పట్నుంచీ ఇప్పటి వరకూ పెద్దగా అద్భుతాలేం జరగలేదు.
పెద్ద తెరపై పెద్ద పెద్ద ప్రయత్నాలు వర్కవుట్ కాకపోవటంతో నిహా ఇప్పుడు మరోసారి ఇంటర్నెట్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. వెబ్ సిరీస్లతోనే కాలం
వెళ్లబుచ్చుతోంది.
‘మ్యాడ్ హౌజ్’ పేరుతో నిహారిక మరోసారి యూట్యూబ్లో హల్ చల్ చేస్తోంది. అయితే, ఆమె సిల్వర్ స్క్రీన్ జర్నీ ఇక ముగిసినట్టేనా? కాదనే అంటున్నారు
కొందరు ఫిల్మ్ నగర్ జనం. ఎందుకంటే, ఆమె హీరోయిన్గా బయటి హీరోలతో చేసిన సినిమాలేవీ గొప్పగా వర్కవుట్ కాలేదు. మరోవైపు మెగా బ్యూటీ
ఇంతవరకూ ఏ మెగా కాంపౌండ్ హీరో సినిమాలోనూ ఫుల్ లెన్త్ రోల్ చేయలేదు. ఇప్పుడు ఆ ప్రయత్నం కూడా చేసే టైం వచ్చేసిందంటున్నారు.
నిహారిక హీరోయిన్గా లాంచ్ అవుతున్న సమయంలో ‘ఒక మనసు’ సినిమా వేడుకలో అల్లు అరవింద్ ఓ మాట అన్నాడు. నాగబాబు కూతురు
హీరోయిన్ అవ్వాలనుకుంటే తన కొడుకు బన్నీ సరసనే ఛాన్స్ ఇచ్చేవాడ్ని, అన్నది, ఆయన మాటల సారాంశం! మరి అప్పట్లోనే ‘సరైనోడు’ సినిమాలో
స్టైలిష్ స్టార్ సరసన నటింపజేద్దామనుకున్న అరవింద్ తరువాత ఎందుకు సైలెంట్ అయిపోయాడు? ఆ సంగతి మనకు తెలియదు కానీ… ఇప్పుడు
మరోసారి ”బన్నీ చిత్రంలో నిహారిక” అంటూ ప్రచారం మాత్రం సాగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయనున్న సినిమాలో ఈ మెగా డాటర్
ఉంటుందట. ఇంకా దీనిపై కన్ ఫర్మేషన్ రాలేదు కానీ. అసలు సుక్కూ మూవీలో ‘సూర్యకాంతం’ నటిస్తే… ఆమె పాత్ర ఎలా ఉంటుంది? హీరోయిన్
క్యారెక్టర్ చేస్తుందా? లేక ఏదైనా కీలక పాత్ర పోషిస్తుందా? బోలెడు అనుమానాలైతే ఉన్నాయి. క్లారిటీ ఇవ్వాల్సింది బన్నీ అండ్ సుకుమారే!