నెల్లూరు : అధికారులు స్పందించారు. గ్రామస్తుల స్మశాన సమస్యకు శాశ్విత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వడ్డేసంఘం గ్రామంలో ఈ నెల 19న గుండెపోటుతో మృతి చెందిన వల్లెపు దశరథ రామయ్య మృతదేహాన్నీ ఖననం చేసేందుకు స్థలం లేక మూడురోజులుగా అధికారుల చుట్టూ తిరిగారు. ఎస్ఐ, డిప్యూటీ తహశీల్దార్ గ్రామానికి వచ్చి గ్రామస్తులతో చర్చించి తాత్కాలిక పరిష్కారం చూపి దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామానికి శాశ్విత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.