Home ప్రకాశం ఎన్‌సిసి దినోత్సవం సందర్భంగా రక్తదానం

ఎన్‌సిసి దినోత్సవం సందర్భంగా రక్తదానం

585
0

చీరాల : ఘనంగా ఎన్సీసీ దినోత్సవం విఆర్ఎస్& వైఆర్ఎన్ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సిసి అధికారి రఘు మాట్లాడుతూ ఎన్సిసి దినోత్సవం సందర్భంగా కాడేట్లు 22మంది రక్తం దానం చేశారని తెలిపారు. ప్రతి ఒక్క ఎన్సిసి కాడేట్ రక్త దానం చేయడానికి ముందుకు రావాలని కోరారు.

అలానే ప్రతి ఒక్కరు దేశ అవసరాల రీత్యా దేశం కోసం పాటుపడలన్నారు. ముందుగా కళాశాలలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మన్నెపల్లి బ్రమ్మయ్య, కల్నల్ మహమ్మద్ ఫరూక్, వైద్యులు ఆజాద్ పాల్గొన్నారు.