Home ప్రకాశం నాయీబ్రాహ్మణ కార్తీక వన మహోత్సవం

నాయీబ్రాహ్మణ కార్తీక వన మహోత్సవం

444
0

చీరాల : నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమాహార మహోత్సవంను చీరాల వాడరేవులో
ఘనంగా నిర్వహించారు. హైమా హాస్పటల్ అధినేత, రాష్ట్ర బిసి నాయకులు డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సంఘం ఐక్యత, సమానత్వంతో కలసి మెలసి ఉండాలని కోరారు. రానున్న ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం బిసిలకే కేటాయించాలని కోరుతున్న విషయాన్ని గుర్తు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎస్సి, ఎస్టి, బిసి కులాలు వివక్షకు గురవుతూ అంటరాని వారుగా ఉంటున్నారని అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా ముందుకు ప్రయా నించాలని అన్నారు.

కామాక్షి కేర్ హాస్పటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ తాను డాక్టర్ సుబ్బారావును ఆదర్శంగా తీసుకొని బడుగు భలహీన వర్గాలకోసం హాస్పటల్ ను చీరాలలో స్థాపించనని చెప్పారు. నాయి బ్రాహ్మణ సంఘంలో చదువు కోవటానికి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం తప్పనిసరి తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో యువకులు, మహిళలు ఆటపాటలతో అలరించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి కామాక్షి హాస్పటల్ సహకారంతో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జీ సుబ్బారావు, తాడివలస దేవరాజు, వల్లూరి దుర్గ ప్రసాద్, గుంటుపల్లి నవీన్, ఎం శ్రీనివాసరావు, ఏ వెంకట్రావు పాల్గొన్నారు.