Home ప్రకాశం నాయి బ్రాహ్మణులకు స్థానిక సంస్థల్లో ప్రాధాన్యత కల్పించాలి : రాష్ట్ర అధ్యక్షులు యానాదయ్య

నాయి బ్రాహ్మణులకు స్థానిక సంస్థల్లో ప్రాధాన్యత కల్పించాలి : రాష్ట్ర అధ్యక్షులు యానాదయ్య

367
0

– మూడు రాజధానుల కు మద్దతుగా నాయి బ్రాహ్మణులు సభ విజయవంతం.
– నాయి బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్సార్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న డాక్టర్ మాదాసి వెంకయ్య
ఒంగోలు : స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యానాదయ్య కోరారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మీయ సమావేశంలో పిడిసిసిబి ఛైర్మన్‌ డాక్టర్ మాదాసి వెంకయ్య, వైయస్సార్సీపి జిల్లా వైద్య విభాగం అధ్యక్షులు భక్తుల అశోక్ కుమార్ రెడ్డి, రాష్ట్ర గౌరవ సలహాదారులు డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, బిసి యూత్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు తాడివలస దేవరాజు మాట్లాడారు.

సమావేశంలో జిల్లా అధ్యక్షులు వల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణులకు రూ.10వేలు ఇచ్చినందుకు సిఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ఎంపి, పిఎంపిలకు రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో శిక్షణ ఇచ్చి గ్రామీణ వైద్యులుగా గుర్తింపు తెచ్చారని గుర్తు చేశారు. దాన్ని గత ప్రభుత్వం తుంగలో తొక్కే సారని, మళ్లీ ఈ పథకాన్ని పునరుద్ధరించాలని పాదయాత్రలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని కోరగా ఖచ్చితంగా నెరవేరుస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు యానాదయ్య మాట్లాడుతూ నాయీబ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను త్వరలో అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్సార్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళతానని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్కాపురం వెంకటరామారావు, ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు పతకమురి మాధవరావు, వైయస్సార్సీపి బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బల్లిపల్లి కొండలరావు, రాష్ట్ర కార్యదర్శి అన్నవరపు గురుమూర్తి, యువజన నాయకులు బసవేశ్వరరావు, సాయి కిరణ్, నాగేశ్వరరావు, సింగయ్య పాల్గొన్నారు.