కందుకూరు : ప్రముఖ సైకాలజిస్టు పసుపులెటి పాపారావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డా. పి లక్ష్మన్న ఎడ్యుకేషనల్, హెల్త్ & అగ్రికల్చరల్ వెల్ఫైర్ సొసైటీ అధ్యక్షులు ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్టు డాక్టర్ పెద్దిగారి లక్ష్మన్న ఆద్వర్యంలో ఈ నెల 23న (ఆదివారం) కర్నూలు కెవిఆర్ డిగ్రీ కళాశాలలో ఒక్క రోజు పాటు ఉదయం 9.00 గ. నుండి సా.6 00 వరకు జాతీయ స్థాయిలో పర్సనాలిటీ డెవలప్మెంట్, జీవన నైపుణ్యాలపై వర్కు షాపు నిర్వహిస్తారని తెలిపారు. వర్క్ షాప్ లో స్టడీ స్కిల్స్ , మైండ్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, స్ట్రేస్ మేనేజ్మెంట్, ఫ్వామిలి, పేరెంటింగ్ రిలేషన్ షిప్, లైఫ్ స్కీల్స్ పై సీనియర్ సైకలాజిస్టులు డాక్టర్ పెద్దిగారి లక్ష్మన్న, అనంత కుమార్ అనుమకొండ, క్లినికల్ సైకలాజిస్టు డాక్టరు లక్ష్మి నారాయణ, న్యూరో సైకియాట్రస్ట్ డాక్టరు యమ్ ఎతిరాజులచే శిక్షణ ఇస్తారని తెలిపారు.
ఈ వర్క్ షాప్ కు ప్రొపెషనల్స్, ఉపాద్యాయులు, అద్యాపకులు, అడ్వకేట్లు, ఉద్వోగులు, తల్లిదండ్రులు, ట్రైనర్స్, సైకలాజిస్టులు, గృహిణులు, నిరుద్వోగులు, విద్యార్థులు, యువతి, యువకులు, సెల్ప్ ఎంప్లాయిస్, ఆసక్తి కల్గిన అందరు హాజరు కావాలని కోరారు. వివరాలకు అమృత సైకలాజికల్ కౌన్సెలింగ్ & హెచ్ఆర్డి సెంటర్, డోర్-214, రెండవ అంతస్తు, ఆర్కె ల్యాబ్ పైన, రాజ్ విహార్, కర్నూలులో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 77802 08733, 94413 71817 నంబర్లలో సంప్రదించాలని చెప్పారు. ఈ నెల 21 సా.5.00 గంటల లోపు నమోదు చేసుకోవాలని తెలిపారు.