Home జాతీయం అత్యధికులు మాట్లాడే భాషల్లో రెండొస్తానంలో హిందీ

అత్యధికులు మాట్లాడే భాషల్లో రెండొస్తానంలో హిందీ

713
0

అమరావతి : హిందీనేర్చుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతూన్నారు. ఉద్యోగావకాశాల్లో హిందీ భాష కీలకంగా మారింది. 1949 సెప్టెంబరు 14న హిందీని జాతీయ భాషగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించదాంతో అప్పటి నుండి రాష్ట్ర భాషా ప్రచార సమితి (వార్థా) హిందీ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. హిందీని జాతీయ భాషగా గుర్తించారు.

హిందీ దేవనాగరిక లిపి నుండి రూపొందించబడింది. ఈ భాష ఇండో యూరోపియన్ భాష సంతతికి చెందిన ఇండో-ఆర్యన్ శాఖకు చెందినది. హిందీ అంటే “పర్షియన్ కానుక” అని అర్థం. హిందీ భాష సంస్కృతం నుంచి గ్రహించబడినది. కాలక్రమంలో ఉత్తర భారతదేశంలోని ముస్లిం వల్ల పర్షియన్, అరబిక్, టర్కిష్ పదాలు హిందీలో చేరి ఉర్దూ భాష ఆవిర్భవించింది.

శుద్ధ హిందీ(ప్యూర్ హిందీ) భాషను రేడియోలలో, టివి వార్తలలో వినవచ్చు. ఇప్పుడు చలామణిలో ఉన్న హిందీ భాష చాలా వరకూ సులభతరం చేయబడింది. చాలా దేశాలలో హిందీ భాషను మాట్లాడుతారు. మారిషస్, ట్రినిడాడ్, అమెరికా, దక్షిణాఫ్రికా, న్యూజిల్యాండ్ వంటి దేశాలలో ఇప్పటికీ హిందీ ముఖ్య భాషగా వాడుకలో ఉంది.

అయితే… చాలా మందికి తెలియని విషయం ఏంటంటే… ప్రపంచంలోనే ఎక్కువగా మాట్లాడే భాషలలో హిందీ భాష రెండవది. ఇది మనందరం గర్వించదగిన విషయం. మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా దేశంలో ఐక్యతకోసం ఈ భాషనే వాడేవారు. ఈ భాషను “లాంగ్వేజ్ ఆఫ్ యూనిటి” అంటారు. అంత గొప్ప భాష కాబట్టే మేరా భారత్ మహాన్ అంటున్నాం. హిందీ నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భాష సమస్య లేకుండా జీవించ వచ్చన్నమాట. ఇతరులు అర్దం చేసుకోవడాన్ని సులభమైన బాష హిందీ ఒక్కటే.

ప్రతివారికి విద్య విధానాలు అందాలంటే తప్పనిసరిగా మాతృభాషలోనే చదువుకోవాలి. విభిన్న భాషలున్న భారతదేశములో ఒకరి భావావేశాలు మరొకరు అర్ధము చేసుకునేందుకు ఒక కామన్‌ ల్యాంగ్వేజ్ అవసరముంది. ప్రపంచ దేశాల ప్రజలతో సంభాషించేందుకు ఇంగ్లిష్ కు ఉన్న ప్రాముఖ్యత మరియేఇతర భాషకు లేదు. ఇప్పుడు ఇంగ్లిష్ నేర్చుకోవడం తప్పనిసరి అవుతుంది. ఈ విధముగా హిందీయేతర ప్రాంతాలలో మూడు భాషలు నేర్చుకోవడం కష్టతరం, అసంపూర్ణమవుతుంది. అందువలన హిందీని అనవసరముగా నేర్చుకోమని బలవంతము పెట్టకూడదని, మాతృభాషను కించపరచవద్దనేది మా భావన.