– మొదటి విడతలో పేరాలహై స్కూలును ఎంపిక చేసినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు
– నాడు నేడుతో రూపురేఖలు మార్చుకున్న పేరాల ఏఆర్ఎం స్కూల్
– పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో వేగంగా జరిగిన నాడు నేడు పనులు
– మున్సిపల్ కమిషనర్, డిఈలకు ప్రత్యేక ధన్యవాదాలు
– పేరాల హై స్కూల్ లో విద్యార్థులను చేర్చాలన్న పూర్వ విద్యార్థి తాడివలస దేవరాజు
చీరాల : సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాడు నేడు కార్యక్రమం పేరాల ఆంధ్ర రత్న మున్సిపల్ హైస్కూల్లో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పేరెంట్స్ కమిటీ కోఆప్షన్ సభ్యుడు, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు, చైర్మన్, వైస్ చైర్మన్ మెర్సీ, ఇందిరా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాల్మన్ రాజు ఆధ్వర్యంలో పనులు పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా తాడివలస దేవరాజు మాట్లాడుతూ నాడు నేడు పథకం క్రింద ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు మరమ్మతులు చేపట్టడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక మరుగుదొడ్లు, తరగతి గదులలో కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా టైల్స్, ఎలక్ట్రికల్ వర్క్, తలుపులు, ఇతర మరమ్మత్తులను చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
పేరెంట్స్ కమిటీ తరఫున సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రైవేట్ పాఠశాలలకు ఏ మాత్రం తగ్గకుండా అనేక సదుపాయాలను ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయన్నారు. అమ్మ ఒడి పథకం, మధ్యాహ్న భోజనం జగన్న గోరుముద్ద, ఎంతో అనుభవం ఉన్న ఉపాధ్యాయులు, నాడు నేడు కింద పాఠశాలలో అనేక సదుపాయాలు ఉన్నాయన్నారు. విద్యార్థులకు జగనన్న కిట్లు అన్ని ప్రభుత్వ పాఠశాలలో అందుతాయని చెప్పారు. కార్పొరేట్ కు దీటైన సౌకర్యాలు సమకూరుతున్నందున పిల్లలను పేరాల ఆంధ్రరత్న మున్సిపల్ హైస్కూల్ లో చేర్పించాలని కోరారు. చీరాల మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, డిఈ యేసయ్యా, ప్రధానోపాధ్యాయులు సాల్మన్ రాజుకు పేరెంట్స్ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.