Home బాపట్ల నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి

నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి

10
0

బాపట్ల (DN5 News) : అక్షరాంధ్ర కార్యక్రమం చదువు నేర్చుకునే లబ్ధిదారులందరూ నూరు శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలపై విద్యాశాఖ రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ పి రంజిత్ బాషా (RanjithBasha IAS)అన్ని జిల్లాల కలెక్టర్లతో రాజధాని అమరావతి నుంచి బుధవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లా నుండి కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ వీక్షణ సమావేశంకు హాజరైనారు.

అక్షరాస్యత పెంచడం, డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత సాధించడమే ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని కోన శశిధర్ (Kona sashidhar, IAS) అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో మన రాష్ట్రంలో గత నవంబర్ నుండి అమలు చేయడమైనదని అన్నారు. చదువు నేర్చుకున్న వారు చదవడం, రాయడం, లెక్కలు చేయడం వంటి అంశాలలో ఏమాత్రం పురోగతి సాధించారని అంచనా వేయడానికి ప్రభుత్వం మార్చి 15న ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. లబ్ధిదారులు వారికి వీలైన సమయంలో పరీక్షా కేంద్రానికి వచ్చి పరీక్షలు రాయవచ్చని చెప్పారు. ఈ పరీక్ష 3 గంటల పాటు జరుగుతుందని తెలిపారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని అక్షరాస్యులుగా గుర్తిస్తూ నేషనల్ లిటరసీ మిషన్ అథారిటీ, జాతీయ సార్వత్రిక విద్యాసంస్థ వారు సంయుక్తంగా అధికారికి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారని చెప్పారు. ఈ పరీక్షలు లబ్ధిదారులకు అందుబాటులో వారి గ్రామాల్లోనే నిర్వహిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని చదువు నేర్చుకున్న మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

వయోజన విద్య నేర్చుకునే మహిళలకు ఈనెల 28న ఫ్రీ ఫైనల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు విద్యా శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనా శశిధర్ తెలిపారు. ఈ పరీక్షకు లబ్ధిదారులందరూ హాజరై వారి పురోగతిని పరీక్షించుకొని మార్చి 15న జరిగే చివరి పరీక్షకు సన్నద్ధం కావాలని అన్నారు. లబ్ధిదారులందరూ నూరు శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. సమావేశంలో వయోజన విద్య జిల్లా నోడల్ ఆఫీసు మధుసూదనరావు, పిడి డిఆర్డిఎ సింగయ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి రాధా మాధవి, బాపట్ల డిఎల్డిఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.