Home ప్రకాశం పారిశుద్ధ్య కార్మికుల రెండోరోజు సమ్మె

పారిశుద్ధ్య కార్మికుల రెండోరోజు సమ్మె

508
0

చీరాల : పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పుతెస్తూ పట్టణ ప్రజలపై అదనపు పన్నుల భారం వేసే జీఓ279 రద్దు చేయాలని కోరుతూ మున్సిప‌ల్ పారిశుద్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టారు. చీరాలలో సమ్మెను విచిన్నం చేసేందుకు తొలిరోజు అధికారులు ప్రయత్నం చేశారు. కార్మికులను బెదిరింపులకు గురిచేశారు. అయితే రెండోరోజు మాత్రం కార్మికులు సమ్మె చేసి మునిసిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

జివొ వెనక్కి తీసుకునేవ‌ర‌కు కార్మికుల పోరాటం కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు. ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌పై ప‌న్నుల భారం వేస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌పై అదనపు పన్నులు వేస్తారని మున్సిప‌ల్ కార్మిక జెఎసి నాయ‌కులు పేర్కొన్నారు. అర్ధరాత్రి కార్మికుల ఇళ్లకు వెళ్లి పనులకు రాకుంటే కొత్తవారిని పెట్టుకుంటామనే బెదిరింపుచర్యలకు దిగడం సరికాదన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎన్ బాబురావు, చీకటి శ్రీనివాసరావు, ఏ బాబురావు, వసంతరావు, రమణ, డి నాగేశ్వరరావు, కోటిదాసు, సింగయ్య పాల్గొన్నారు.