Home ప్రకాశం ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన చదువులు

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన చదువులు

194
0

చీరాల : ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలకు ఆరోగ్యవంతమైన వాతావరణంతో పాటు విశ్లేషణాత్మకమైన, నాణ్యమైన చదువులు అందుతాయని ఎంపీడీవో సాంబశివరావు పేర్కొన్నారు. దేవాంగపురి పంచాయతీలో నాడు నేడు పాఠశాల పథకం పరిధిలో ఎంపికైన శంకరయ్య ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. నాడు నేడు ద్వారా పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రుల తో ఆయన మాట్లాడారు. అర్హులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతుందని చెప్పారు. పాఠశాలలో ప్రస్తుతం 70 మంది విద్యార్థులు ఉన్నారని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం వంద మంది విద్యార్థులను చేర్చే విధంగా ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్య కమిటీ ప్రతినిధులు కృషి చేయాలని కోరారు. పాఠశాల ప్రహరీ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు.

ఈ సందర్భంగా పాఠశాలలో తాగునీటి సౌకర్యం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి కే అంకయ్య, ప్రధానోపాధ్యాయులు శివ కుమారి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ లవ కుమార్, వైస్ చైర్మన్ పింజల సుకన్య, సి ఆర్ పి ఏ రాఘవ రావు పాల్గొన్నారు.