హైదరాబాద్: బీసీల కోసం నల్గొండ సీటును త్యాగం చేయడానికి సిద్ధమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో ఆరు దరఖాస్తులు వచ్చాయని అందరి బలాబలాలు పరిశీలిస్తామని తెలిపారు..
సమర్థులైన వారికే టికెట్లు ఇస్తామన్నారు. పీఈసీ సభ్యులతో ఏఐసీసీ వన్ టూ వన్ మాట్లాడాలని రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారని, ఆ ప్రతిపాదనకు అందరం ఆమోదించినట్టు తెలిపారు. ఎన్నికల ముందు కేటీఆర్ అమెరికా పర్యటనలో ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు..