Home ప్రకాశం ఘ‌నంగా మాతృబాషా దినోత్స‌వం

ఘ‌నంగా మాతృబాషా దినోత్స‌వం

287
0

చీరాల : అంత‌ర్జాతీయ మాతృబాషా దినోత్స‌వం సంద‌ర్భంగా సీనియ‌ర్ సిటిజ‌న్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం ఎన్‌జిఒ హోమ్‌లో జ‌రిగిన స‌ద‌స్సులో అసోసియేష‌న్ రాష్ట్ర అధ్య‌క్షులు చుక్క‌ప‌ల్లి రామ‌కోట‌య్య మాట్లాడారు. మాతృబాష‌ను ర‌క్షించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ బాష‌ల‌ను ర‌క్షించుకుంటున్న‌ట్లే తెలుగు బాష‌కు ప్రాచీన హోదా క‌ల్పించాల‌ని కోరారు. తెలుగును ప్ర‌ధ‌మ బాష‌గా చేయాల‌న్నారు. భావిత‌రాల‌కు మాతృబాష‌ను బోధించాల‌ని కోరారు. కార్య‌క్ర‌మంలో విశ్రాంత ఎంఇఒ జంగా మోహ‌న‌రావు, అచ్చుత రామారావు, బొడ్డు సంజీవ‌రావు, ఇండ్ల దేవ‌దానం, గుమ్మ‌డి ర‌మేష్‌, ఊరా మ‌స్తాన్‌రావు, ఆనంద్‌, పి నాగ‌మ‌నోహ‌ర్‌లోహియ పాల్గొన్నారు.

జీవితంలో క‌న్న‌త‌ల్లిని, మాతృబాష‌ను మ‌రువరాద‌ని నీలం జేమ్స్ ఉన్న‌త పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయులు రావి వెంక‌ట‌ర‌మ‌ణ అన్నారు. పాఠ‌శాల విద్యార్ధుల‌కు ప‌ద్యాల పోటీలు నిర్వ‌హించి విజేత‌ల‌కు బ‌హుమ‌తులు అంద‌జేశారు. ప‌ర‌బాషా వ్యామోహంతో మాతృబాష‌ను చిన్న‌చూపు చూస్తున్నార‌ని అన్నారు. ప్ర‌భుత్వం కూడా మాతృబాష‌కు త‌గిన ప్రాధాన్య‌త ఇవ్వ‌డంలేద‌న్నారు. ప్ర‌భుత్వ ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌రాలు మాతృబాష‌లో జ‌రిపితే బాగుంటుంద‌న్నారు. కార్య‌క్ర‌మంలో ఉపాధ్యాయులు వి శివ‌రామ‌కృష్ణ‌, ఆర్‌వి సాంబ‌శివ‌రావు, పాండురంగారావు, ర‌మావాణి పాల్గొన్నారు.