చీరాల : పేరాల ఆంధ్ర రత్న మునిసిపల్ హై స్కూల్ నందు ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం హీడ్ మాస్టర్ సాల్మన్ రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ నెల 21న మాతృభాషా దినోత్సవం సందర్బంగా సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండీ తాడివలస దేవ రాజు మాట్లాడుతూ మాతృ భాషను ప్రేమించు, ఇతర భాషలను గౌరవించాలని పిలుపునిచ్చారు. భాష ద్వారానే మనం సంపూర్ణ జ్ఞానం సంపాదించ గలమని తెలిపారు.
హీడ్ మాస్టర్ సాల్మన్ రాజు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ మాతృ భాషపై అందరూ పట్టూ సాధించాలని, భాష అనే జ్ఞానం ద్వారానే ఒకరి భావాలు ఒకరు అర్థం చేసుకోగలరు తెలిపారు. విద్యార్థులచే కార్యక్రమాలు, తెలుగు మాస్టర్ చంద్రకి సన్మానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శివప్రసాద్, చంద్ర, రమణ, గాంధీ, సుబ్రమణ్యకుమార్, సుశీల, కృష్ణమోహన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.