Home క్రైమ్ నిశ్చితార్ధం తర్వాత పెళ్లి రద్దైందనే మనస్థాపంతో తల్లి, కూతురు ఆత్మహత్య

నిశ్చితార్ధం తర్వాత పెళ్లి రద్దైందనే మనస్థాపంతో తల్లి, కూతురు ఆత్మహత్య

20
0

మార్టూరు (DN5 News) : నిశ్చితార్థం చేసుకున్న యువకుడి శాడిజానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. తప్పుడు కధనాలు, స్నేహితుల చెప్పుడు మాటలతో త్వరలో వివాహం చేసుకోనున్న యువతిని కుటుంబ సభ్యుల ముందు అవమానకరంగా మాట్లాడటంతోనే తల్లీ, కుమార్తె తట్టుకోలేక గడ్డి మందులో ఎలుకల మందు కలుపు కొని ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందడం మండలంలోని ద్రోణాదుల గ్రామంలో విషాదం నింపింది.

ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. బాధిత కుటుంబ సభ్యులు, గుంటూరు పోలీసుల కధనం ప్రకారం మండలంలోని ద్రోణాదుల శివాలయం సమీపంలో కిరాణా కొట్టు నిర్వహిస్తున్న చిరికొండ శ్రీనివాసరావు, సుజాత దంపతులకు బిటెక్ చదివిన కుమార్తె దివ్య (26) యుఎస్‌లో ఉన్నత విద్య చదువుతున్న కుమారుడు హేమంత్ కుమార్ ఉన్నారు. గత మూడేళ్ళుగా హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న దివ్యకు మార్టూరు, నాగరాజుపల్లి సెంటర్‌లో నివాసం ఉంటున్న సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న రావులకొల్లు శేషుబాబుతో గతేడాది వేడుకగా నిశ్చితార్థం చేశారు. ఈ ఏడాది వేసవి సెలవుల్లో వివాహం చేయాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి.

ఈ క్రమంలో ఈ నెల 4న మాట్లాడాలంటూ దివ్య ఆమె తల్లి దండ్రులను పిలిపించిన శేషు బాబు ఈ వివాహం తానూ చేసుకోనని తేల్చి చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైన దివ్య ఆమె తల్లి సుజాత అదే రోజు తమ ఇంటికి చేరుకొని పురుగు మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుంటూరులోని కార్పొరేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఈ నెల 12న మృతి చెందారు. ఈ నేపథ్యంలో తమ గ్రామానికి చెందిన తల్లి కుమార్తె మృతి చెందడం పట్ల గ్రామస్తులు భగ్గుమన్నారు. నిశ్చితార్థం చేసుకొని పెళ్లి చేసుకోబేయే యువతిని పెళ్ళికి ముందే వేధింపులకు గురిచేసిన రావులకొల్లు శేషుబాబు, అతడికి సహకరించిన స్నేహితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

గుంటూరు మార్చురీలో మృతదేహాలు
మనస్తాపంతో పురుగుమందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన దివ్య, ఆమె తల్లి సుజాత మృతదేహాలకు మార్టూరు అర్బన్ సీఐ యార్లగడ్డ శ్రీనివాసరావు గుంటూరు సర్వజన సమగ్ర వైద్యశాలలో శుక్రవారం పోస్టు మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. యుఎస్ నుండి కుమారుడు హేమంత్ కుమార్ ఇండియాకు రావడం ఆలస్యమవుతున్న కారణంగా రెండు మృతదేహాలను గుంటూరులోని ఫ్రీజర్‌లో బధ్రపరిచినట్లు తెలిపారు. దివ్య తండ్రి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.