Home ప్రకాశం బిపిఎస్… చీరాల మునిసిపాలిటీ ఆదాయం ఎంతో తెలుసా…?

బిపిఎస్… చీరాల మునిసిపాలిటీ ఆదాయం ఎంతో తెలుసా…?

436
0

చీరాల : పట్టణాల్లో అక్రమ నిర్మాణాలు, అనుమతికి విరుద్ధంగా కట్టిన నిర్మాణాలను క్రమబద్దీకరణకు ప్రభుత్వం అనుమతించింది. అపరాధ రుసుము చెల్లించి ఆగస్టు నెలాఖరులోపు క్రమబద్దీకరించుకునేందుకు అవకాశం ఇచ్చింది.

చీరాల మునిసిపాలిటీ పరిధిలో 194అక్రమ భవనాలు గుర్తించి నోటీసులు ఇచ్చినట్లు కమిషనర్ రామచంద్రారెడ్డి, టిపిఓ శ్రీనివాసరావు తెలిపారు. వీరిలో ఇప్పటికి 108మంది క్రమబద్దీకరించుకున్నట్లు తెలిపారు. వీరి ద్వారా ప్రభుత్వానికి రూ.89లక్షలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఇంకా పెండింగులో ఉన్న వారిలో 44మందికి తెలియపర్చామని, మిగిలిన వారికి కూడా మరోసారి నోటీసులు ఇస్తామని తెలిపారు. ఈ నెల 31వరకు గడువు ఉన్నందున అక్రమ కట్టడాలు క్రమబద్దీకరించుకోవాలని కోరారు.