వెబ్ డెస్స్ : ఎన్నికలొచ్చాయంటే… నేతల పాట్లు, ఫీట్లు చెప్పనక్కరలేదు. గత సాధారణ ఎన్నికల సందర్భంగా నేతల సభలకు జనం రాకపోయినా గ్రీన్ మాట్‌లు వేసి సినిమా స్టైల్‌లో జనం కిక్కిరిసినట్లు టివిల్లో చూపించిన సన్నివేశాలు తెలుగు ప్రజలు చూశారు. అలాగే నేతలను టివిలు, సోషల్ మీడియాలో పొగిడించుకోవడం చూశారు. ఆ పొగిడిన మహిళలెవరో ఆతర్వాత సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చూశారు.
అచ్చం అలాగే ఇప్పుడు మోడీ తాత స్టంట్స్ చేస్తున్నారు. బీహార్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి కదా… అక్కడి ప్రజలను ఆకర్షించేందుకు బిజెపి నేతలు కుస్తీ పడుతున్నారు. వాటిని ఎక్స్ వేడికగా ‘వాహ్ మోదీజీ వాహ్.. మరోసారి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన బీజేపీ’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. తమ బిల్డప్పుల కోసం డబ్బులు ఇచ్చి మరీ ప్రజలతో డ్రామాలు ఆడించిన బీజేపీ. నాయకులపై పూలు చల్లేందుకు.. పూలతో సహా రూ.500 ఇచ్చిన కాషాయ పార్టీ. మొన్న మోదీ రోడ్ షోలో పూలు చల్లి, హారితి ఇచ్చిన వారికీ డబ్బులు ఇచ్చిన వైనం. ఇవిగో డ్రామా లెక్కలు : పూలు చల్లితే రూ.500, హారతి ఇస్తే రూ.700, మోదీని చూసి ఏడిస్తే రూ.1000, మోదీని దేవుడని పిలిస్తే రూ.1200 ఇలా చెల్లించి మరీ ఎన్నికల రోడ్‌షోలు రక్తి కట్టించారట. ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






