Home జాతీయం మోడీపై మరో అవిశ్వాసానికి సిద్ధం అవుతున్న పార్టీలు

మోడీపై మరో అవిశ్వాసానికి సిద్ధం అవుతున్న పార్టీలు

330
0

డిల్లి : మోడీ ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంతో మొన్నటి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. విపక్షాలకు సమాధానం చెప్పలేక మోడీ సర్కారు సమావేశాలను వాయిదా వేసుకునిపోయింది. దాదాపు నెలకు పైగా ప్రతి రోజు సభ సమావేశం కావడం వాయిదా పడడం అన్నట్లుగానే సెషన్ మొత్తం నడిచింది. ప్రజాస్వామ్యం మీద గౌరవం మాకే ఉందని పెద్ద పెద్డ మాటలు చెప్పే మోడీ, ఇతర బీజేపీ నేతలు అవిశ్వాసంపై చర్చ జరపకుండా ప్రజాస్వామ్యాన్ని ఖుని చేశారు. అయితే త్వరలో జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మోడీ ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ స‌మాయ‌త్తమౌతోంది. వ‌చ్చే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తామ‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తామ‌ని కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి అభిషేక్ మ‌ను సింఘ్వి తెలిపారు.

ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ స‌మిష్టి నిర్ణ‌యం తీసుకుని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడ‌తామ‌ని సింఘ్వి అన్నారు. జ‌మ్ము క‌శ్మీర్‌లో అల‌జ‌డి, దేశంలో రైతుల స‌మ‌స్య‌లు, నిరుద్యోగం, అవినీతి, ఆర్ధిక దుస్థితి వంటి అనేక అంశాల‌పై మోడీ స‌ర్కార్‌ను శీతాకాల స‌మావేశాల్లో ఇరుకున పెడ‌తామ‌ని సింఘ్వి తెలిపారు. ప్ర‌తిప‌క్షాల‌న్నీ క‌లిసివ‌స్తే…. ఈ అంశాల‌లో వేటిపైనైనా ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడ‌తామ‌ని సింఘ్వి తెలిపారు. బ‌డ్జెట్ స‌మావేశాల‌ను మోడీ ప్ర‌భుత్వం ఏ విధంగా నీరుగార్చిందో ప్ర‌జ‌ల‌కు ఈ శీతాకాల స‌మావేశాల్లో తెలియ‌జేస్తామ‌ని సింఘ్వి చెప్పారు.

నీర‌వ్ మోడీ అంశాన్ని కూడా సింఘ్వి ప్ర‌స్తావించారు. 7 నెల‌ల త‌ర్వాత నీర‌వ్ మోడీపై రెడ్ కార్న‌ర్ నోటీస్ జారీ కావ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. నీర‌వ్ మోడీని భారత్‌కు వెంట‌నే రప్పిస్తామ‌ని ఢంకా భ‌జాయించిన మోడీ ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేక‌పోతోంద‌ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేసిన ప్రకటనతో బీజేపీలో మళ్ళీ గుబులు మొదలైంది. ఇప్పటికే బడ్జెట్ సమావేశాలను అడ్డుకోవడం ద్వారా టీడీపీ చేసిన పోరాటం దేశ ప్రజల్లో మోడీ పరువు తీసింది. మరో ఏడాదిలోపుగానే ఎన్నిజల్లో జరగాల్సిన తరుణంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు కూడా మోడీ సమాయత్తం అవుతున్నారని వార్తలు వెలువడుతున్న సమయంలో కాంగ్రెస్ అవిశ్వాస ఆయుధం బయటకు తీయడంతో బీజేపీ నేతల్లో కలవరం మొదలైంది.

ఇప్పటికే తాము అడుగుతున్న ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పడం లేదని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా మోడీ విలేకరులతో నేరుగా మాట్లాడలేదని ప్రధాన మీడియా కూడా ఎత్తిచూపుతుంది. వీటన్నిటి నేపథ్యంలో కాంగ్రెస్ అవిశ్వాసం పెట్టడం ద్వారా బీజేపీని, మోడీని మరింత ఇరుకున పెట్టాలని యోచిస్తోంది. పోయినసారి ఎన్డీయేతో పూర్తిగా బంధం తెగకముందే టీడీపీ పార్లమెంటులో మోడీ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది. ఇప్పుడు మోడీ మా శత్రువు అని చంద్రబాబు ప్రకటించారు. కాబట్టి టీడీపీ కూడా అవిశ్వాసం పెట్టె అవకాశం ఉండొచ్చు. అదే జరిగితే ఈసారి బీజేపీ తప్పించుకోలేదు.