చీరాల : ప్రకాశం జిల్లా చీరాల వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ మార్పు గ్రెగొరీ ఆధ్వర్యంలో ” మొబైల్ రైతు బజార్ ” సంచార వాహనాలకు జెండా వూపి ప్రారంభించారు.
నియోజకవర్గం మొత్తం కూడా మొబైల్ రైతు బజార్ వాహనాలలో అందరికి అందుబాటు ధరలకు కూరగాయలు లభిస్తాయని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ సూచనల మేరకు అన్నీ వర్గాల ప్రజలకు అతి తక్కువ ధరలకే కూరగాయలు విక్రయించడానికి ఐదు మొబైల్ రైతు బజార్ వాహనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ కామిరెడ్డి రామచంద్రారెడ్డి, రెండవ పట్టణ ఎస్ఐ, డైరెక్టర్ బజ్జిబాబు, తదితరులు పాల్గొన్నారు.